Journalists Arrest | జర్నలిస్టుల అరెస్ట్.. ఐ అండ్​ పీఆర్​ కమిషనరేట్​కు వెళ్లకుండా కట్టడి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల అసోసియేషన్​ సభ్యులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Journalists Arrest | జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల (SC,ST journalists) అసోసియేషన్​ సభ్యులను పోలీసులు అరెస్ట్​ చేశారు. అక్రెడిటేషన్ కార్డుల (Accreditation card) సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు తలపెట్టిన ఐ అండ్ పీఆర్ కమిషనరేట్ ముట్టడికి (Kamareddy)వెళ్లకుండా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

Journalists Arrest | తెల్లవారుజామునే..

జిల్లా నాయకులను పోలీసులు ఇళ్లవద్దకు వెళ్లి తెల్లవారుజామున ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను జర్నలిస్టులు ఖండించారు. ఈ సందర్బంగా ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్​ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యాదయ్య మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ముట్టడికి వెళ్తున్న జర్నలిస్టులను హౌస్ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లకు తరలించడం సరికాదన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న శాంతియుత నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు.

Journalists Arrest | బేషరతుగా విడుదల చేయాలి..

జిల్లా వ్యాప్తంగా హౌస్ అరెస్ట్ చేసిన జర్నలిస్టులందరినీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేయకుండా, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అరెస్టైన వారిలో జిల్లా అధ్యక్షుడు కుంటోళ్ల యాదయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెడ్డు సాయిలు, జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాండ్ల రాజు, జిల్లా ప్రచార కార్యదర్శి బాలాజీ, ఆశన్న, సంజీవులు, బాబూరావు, కిసరి రాజు ఉన్నారు.

sc1

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

reported as police detained SC/ST journalists ahead of a planned protest demanding resolution of accreditation card issues.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *