Tractor Overturn Accident | అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి

ట్రాక్టర్​ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Tractor Overturn Accident | ఇటుక లోడ్ ఖాళీ చేసి తిరిగి వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాల్వంచ మండలం (Palvancha Mandal) పోతారం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

Tractor Overturn Accident | పాల్వంచ మండలం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం పోతారం గ్రామంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కూలీలు ఇటుక అన్​లోడ్​ చేసి తిరిగి పాల్వంచ వైపు వస్తున్నారు. తిరిగి వస్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన రాయ్ సింగ్(30) ఎముకలు విరిగి మృతి చెందాడు. పాల్వంచకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నర్సింలు, ఒడిశాకు చెందిన కూలీ దేవకుమార్​లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Journalists Arrest | జర్నలిస్టుల అరెస్ట్.. ఐ అండ్​ పీఆర్​ కమిషనరేట్​కు వెళ్లకుండా కట్టడి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *