Jowar Procurement Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కిన రైతన్న..

Shashi kiran Mottala
Jowar Procurement Centers | కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కిన రైతన్న..

అక్షటుడే, పెద్దకొడప్​గల్: Jowar Procurement Centers | రైతులు తాము పండించిన జొన్న పంట (jowar farmers) విక్రయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో (Peddakodapgal) భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

Jowar Procurement Centers | పలుమార్లు విన్నవించినా..

ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ (Bharatiya Kisan Sangh) సభ్యులు మాట్లాడుతూ రైతులు పండించిన జొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు అందజేశామన్నారు. కానీ ఇప్పటివరకు కేంద్రాలను ఏర్పాటు కాకపోవడంతో గత్యంతరం లేనిస్థితిలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనకుండా ఆలస్యం కావడంతో దళారులు ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన రేట్లకు పంటను కొనుగోలు చేస్తున్నారన్నారు.

పండించిన పంటలు ఎక్కడికక్కడ కుప్పలు పోసి ఉంచారని.. అకాల వర్షాలు వస్తే ఎలా అని రైతుల మదనపడుతున్నారన్నారు. ప్రభుత్వం పంటలను కొనకుండా ఆలస్యం చేయడంతో దళారులు లాభపడుతున్నారన్నారు. అప్పులు చేసి పంటలను పండిస్తున్నారని వారు వడ్డీలకే సరిపోవట్లేదన్నారు. రైతుల ధర్నా చేస్తున్నారన్న సమాచారం అందుకున్న తహశీల్దార్, పోలీసులు వారితో మాట్లాడారు. ప్రభుత్వానికి సమస్యను నివేదిస్తామని పేర్కొనడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:Police Prajavani | పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు: సీపీ సాయిచైతన్య

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *