Sun stroke | వడదెబ్బతో మహిళ మృతి

Balla Sandeep Kumar

అక్షరటుడే, కామారెడ్డి: Sun stroke | రాష్ట్రంలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండల తీవ్రతకు బయట తిరగవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

Sun stroke | ఎండ వేడి తట్టుకోలేక..

సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మి(56) మంగళవారం వడ దెబ్బతో మృతి చెందింది. గ్రామంలో ప్రతిరోజూ కూలి పనికి వెళ్లే లక్ష్మి మంగళవారం కూడా వెళ్లింది. అయితే ఎండ తాపానికి తట్టుకోలేకపోయింది. వడదెబ్బ తగలడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Wedding Clash Attack | తెల్లారితే పెళ్లి.. ఇరువర్గాల గొడవ.. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *