Wedding Clash Attack | తెల్లారితే పెళ్లి.. ఇరువర్గాల గొడవ.. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి

Balla Sandeep Kumar

అక్షరటుడే, గాంధారి: Wedding Clash Attack | తెల్లారితే పెళ్లి.. పెళ్లికి ముందు లంబడి సాంప్రదాయబద్ధంగా చేపట్టిన ‘టీకా’ కార్యక్రమం చిలికి చిలికి గాలి వానగా మారింది. ఈ గొడక కాస్త తలలు పగలగొట్టుకునే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. చద్మల్ తండా (Chadmal Thanda)లో జగదీష్, బేల్ సింగ్​లకు ఇంటి స్థలం గురించి తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇదివరకే తహశీల్దార్​ ముందు వీరిని బైండోవర్​ చేశారు. అయితే బేల్​ సింగ్​కు పెద్ద కుమారుడి వివాహం కుదిరింది. దీంతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాంప్రదాయ ‘టీకా’ కార్యక్రమం (‘Vaccination’ Program) నిర్వహించారు. వేడుకలు జరుగుతుండగా బేల్​సింగ్​ ఇంటి జగదీష్​ వచ్చాడు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మరొకసారి గొడవ జరిగింది. దీంతో కర్రలతో కొట్టుకున్నారు. ఇందులో బేల్​సింగ్​ చిన్న కుమారుడితో పాటు జగదీష్​ వర్గంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలవడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి (Kamareddy) ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Wedding Clash Attack | ఇరువర్గాలపై హత్య కేసు నమోదు చేసాం: ఎస్సై

Wedding Clash Attack

చద్మల్​ తండాలో జరిగిన దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశాం. వీరి మధ్య గొడవలు ఉండడంతో ఇదివరకే వీరిని తహశీల్దార్​ ముందు బైండోవర్ చేశాం.

ఇది కూడా చదవండి..: Jukkal Auditorium Renovation | ఆడిటోరియం పునరుద్ధరణకు చర్యలు: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *