Kamareddy Crematorium Development | స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన విషయం తెలియదు : మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఉమారాణి

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Crematorium Development | పట్టణంలో శ్మశాన వాటికల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చిన విషయం బీజేపీ కౌన్సిలర్లు చెప్పే వరకు తమకు తెలియదని కామారెడ్డి మున్సిపల్(Kamareddy Municipality) ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్​లో మీడియాతో మాట్లాడారు.

Kamareddy Crematorium Development | కామారెడ్డి పట్టణంలో..

కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని హౌంసింగ్ బోర్డు, ఇందిరానగర్ కాలనీ శ్మశాన వాటికల సందర్శనకు అన్నిపార్టీల కౌన్సిలర్లతో కలిసి వెళ్లామన్నారు. రెండు శ్మశానవాటికలు పూర్తిస్థాయిలో అభివృధ్ధి చేయడానికి ఎలాంటి వసతులు కల్పించాలి అనే అంశాన్ని పరిశీలించడానికి వెళ్లామని, అయితే శ్మశాన వాటిక అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిన విషయం బీజేపీ(BJP) కౌన్సిలర్లు చెప్పేవరకు తమకు తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టుఫిడ్​కో నిధుల ద్వారా రెండు శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.1.30 కోట్లు మంజూరయ్యాయని, వాటితో అభివృద్ధి కోసం డీపీఆర్ తయారు చేయాలని నిర్ణయించామన్నారు. అంతే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు.

Kamareddy Crematorium Development | పార్టీలకు అతీతంగా..

పార్టీలకు అతీతంగా కామారెడ్డి పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అంతిమంగా పట్టణ అభివృద్దే తమ లక్ష్యమని పేర్కొన్నారు. శ్మశాన వాటికలు, పట్టణ అభివృద్ధికి దాతలు ఎవరు ముందుకు వచ్చిన స్వాగతిస్తామని తెలిపారు. గత పాలకవర్గం పదవీకాలం పూర్తయిన తర్వాత అధికారుల పాలన కొనసాగిందన్నారు. శ్మశాన వాటికల వసతుల కల్పనపై అధికారులు టెండర్లు పిలవాల్సిందని, అయితే అధికారుల నిర్లక్ష్యంతో టెండర్లు రాలేదని తెలుస్తుందన్నారు. టెండర్లు పిలిచి ఉంటే సగం వరకైనా వసతులు కల్పించే అవకాశం ఉండేదని తెలిపారు. ప్రస్తుతం స్వచ్చంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు.

Kamareddy Crematorium Development | 10కే రన్ పోస్టర్ ఆవిష్కరణ

కామారెడ్డి పట్టణంలో తెలంగాణ రన్నర్ సొసైటీ(Telangana Runner Society) ఆధ్వర్యంలో శనివారం చేపట్టనున్న 10కే రన్ పోస్టర్ ను మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఉమారాణి ఆవిష్కరించారు. సొసైటీ ఆధ్వర్యంలో 10కే రన్ చేపట్టడం అభినందనీయమని తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా 10 కే, 5 కే, 2 కే రన్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అంజాద్, జావేద్, హఫీజ్ భేగ్, నాయకులు సిద్దిఖ్, భాస్కర్ గౌడ్, కళ్లెం సత్యం చిట్టిబాబు, కాళ్ల గణేష్, మాజిద్, 10కే రన్ ఇన్​ఛార్జి జ్యోత్స్న, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Punjab Assembly సి ontroversy | పంజాబ్ అసెంబ్లీలో ‘మద్యం’ కలకలం.. సీఎం తాగొచ్చడని ప్రతిపక్షాల ఆరోపణలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *