నిజామాబాద్Dengue Prevention Tips | దోమల నిర్మూలనపై నిర్లక్ష్యం చేయవద్దు..

Dengue Prevention Tips | దోమల నిర్మూలనపై నిర్లక్ష్యం చేయవద్దు..

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డెంగీజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​ పేర్కొన్నారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Dengue Prevention Tips | వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డెంగీజ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​ పేర్కొన్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో వైద్యశాఖ (Health Department) ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డెంగీ రాకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు ఉంటుందని హెచ్చరించారు.

Dengue Prevention Tips | పరీక్షలు చేయించుకోవాలి

జ్వరం, తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్​వో సూచించారు. డెంగీ లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలని, సొంత వైద్యం చేసుకోవద్దని కోరారు. ఈ మేరకు ప్రజలను చైతన్యం చేసేందుకు గ్రామాల్లో అవగాహన ర్యాలీలు చేపడుతున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని హెచ్చరించారు.

Dengue Prevention Tips | నీరు నిల్వ ఉండకుండా చూడాలి

ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కూలర్లు, పూల కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పల్లో నీరు ఉండకుండా ప్రతివారం శుభ్రం చేయాలని ఆయన సూచించారు. డెంగీ దోమ పగటిపూట కుడుతుందన్నారు. పూర్తి చేతుల దుస్తులు ధరించాలని, దోమ తెరలు వాడాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు, చికిత్స ఉచితంగా అందిస్తున్నామని, లక్షణాలుంటే భయపడకుండా వెంటనే ఆస్పత్రికి రావాలని వైద్యాధికారులు కోరారు.

ఇది కూడా చదవండి..: RTI Act | కామారెడ్డి బల్దియాలో స.హ.చట్టం అమలుపై నిర్లక్ష్యం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bhogapuram Airport Protest | రోడ్డు పనులు అడ్డుకున్న రైతులు.. జేసీబీ బకెట్​తో పక్కకు తొలగించిన అధికారులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhogapuram Airport Protest | ఏపీలోని విజయనగరం...

Fake IPL Ticket Apps | నకిలీ యాప్​ల్లో ఐపీఎల్​ టికెట్స్​.. సీపీ సజ్జానర్​ హెచ్చరిక

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fake IPL Ticket Apps | దేశవ్యాప్తంగా ఐపీఎల్​...

RTI Act | కామారెడ్డి బల్దియాలో స.హ.చట్టం అమలుపై నిర్లక్ష్యం..

అక్షరటుడే, కామారెడ్డి: RTI Act | మున్సిపల్ కార్యాలయంలో (Kamareddy Municipality)...

Gig Workers Strike | నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gig Workers Strike | పెరిగిన ఇంధన ధరలు,...