అక్షరటుడే,ఎల్లారెడ్డి : Lakshmikantha Rao | నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పక్కాగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ‘సార్‌తో సర్పంచ్ సాబ్’ కార్యక్రమాన్ని మద్నూర్ మండల (Madnur Mandal) కేంద్రంలో నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Lakshmikantha Rao | ప్రజలతో మమేకమై..
ఎమ్మెల్యే ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. గ్రామస్తులను స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: BRS National Integration Day | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం