Fake Audio | నకిలీ ఆడియోపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

తన పేరుతో పాటు షబ్బీర్ అలీ పేరును వాడుకుంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో పూర్తిగా నకిలీదని పోసానిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త గీరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Fake Audio | తన పేరుతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ(Shabbir Ali) పేరును వాడుకుంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో పూర్తిగా నకిలీదని పోసానిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త గీరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం కామారెడ్డి (Kamareddy Police) డీఎస్పీతో పాటు పట్టణ సీఐకి ఆయన ఫిర్యాదు అందజేశారు.

Fake Audio | 40 ఏళ్లుగా పార్టీలో ఉన్నా..

మహేందర్​రెడ్డి మాట్లాడుతూ.. 40ఏళ్లుగా కాంగ్రెస్‌లో వివిధ పదవులు నిర్వహించిన తాను షబ్బీర్ అలీతో ఎలాంటి ఫోన్ సంభాషణ జరపలేదని స్పష్టం చేశారు. అయితే జూన్ 12 రాత్రి నుంచి కొందరు వ్యక్తులు తామిద్దరం ఫోన్‌లో మాట్లాడినట్లు, కాంగ్రెస్ నేతలను విమర్శించినట్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడినట్లు నకిలీ ఆడియో సృష్టించి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో (Facebook) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆడియో ప్రచారం తర్వాత తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు వెల్లువెత్తుతున్నాయని, కొందరు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో విభేదాలు సృష్టించి నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. తప్పుడు ఆడియో సృష్టించిన వారితో పాటు దాన్ని ప్రసారం చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నకిలీ ప్రచారంతో తన ప్రతిష్టకు తీవ్రనష్టం వాటిల్లిందని, సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

ఇది కూడా చదవండి: Telangana Voter List Revision | జూన్ 25 నుంచి SIR సర్వే.. కీలక తేదీల షెడ్యూల్ ఇదే

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *