NSUI Leaders Suspension | ఎన్​ఎస్​యూఐ నాయకులపై సస్పెన్షన్​ రద్దు

జిల్లాలో ఎన్​ఎస్​యూఐ నాయకులపై విధించిన సస్పెన్షన్​ను ఎత్తివేస్తున్నట్లు డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: NSUI Leaders Suspension | జిల్లా (Nizamabad)లో ఎన్​ఎస్​యూఐ నాయకులపై విధించిన సస్పెన్షన్​ను ఎత్తివేస్తున్నట్లు డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

NSUI Leaders Suspension | కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ కార్యక్రమంలో..

ఎన్ఎస్​యూఐ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్​, 48వ డివిజన్​ మాజీ అధ్యక్షుడు వుండ్ర సాయికిరణ్​, ఎన్​ఎస్​యూఐ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నరేన్​ దీప్​లపై సస్పెన్షన్ ఉత్తర్వుల రద్దు చేస్తూ ప్రాథమిక సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ కార్యక్రమంలో జరిగిన క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ఏప్రిల్​ 8న ఈ ముగ్గురిపై సస్పెన్షన్​ విధించామని ఆయన పేర్కొన్నారు.

అనతరం విషయాన్ని పునఃపరిశీలించి, సమగ్రంగా చర్చించిన అనంతరం, సస్పెన్షన్, ప్రాథమిక సభ్యత్వ రద్దు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయించిందన్నారు. పైన పేర్కొన్న ముగ్గురు నాయకులతో పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు సంబంధాలు కలిగి ఉండకూడదనే నిబంధనలు పూర్తిగా రద్దు చేయబడ్డాయని పేర్కొన్నారు. సదరు నాయకులు ఇకపై పార్టీ క్రమశిక్షణను కాపాడుతూ, ఏఐసీసీ, అధిష్టానం సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Private Teachers Safety | ప్రైవేట్​ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి : ట్రస్మా వినతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *