Yashaswini Reddy | యశస్వినీ రెడ్డిని విద్యాశాఖ మంత్రి చేయాలి : బీజేపీ చీఫ్​ రాంచందర్​రావు

సీఎం రేవంత్​రెడ్డి విద్యాశాఖ మంత్రిగా తప్పుకొని, యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్​రావు అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yashaswini Reddy | ఎన్నికల్లో పోటీ వయసు 21 ఏళ్లకు తగ్గించాలన్న రేవంత్ ప్రతిపాదన యువతను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు (Ramchander Rao) అన్నారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్​ యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డిని విద్యాశాఖ మంత్రి చేయాలన్నారు.

పార్టీ కార్యాలయంలో సోమవారం రాంచందర్​రావు మీడియాతో మాట్లాడారు. 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు నిధుల కొరత, అధ్యాపకుల కొరతతో తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలకు వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. రేవంత్ పాలనలో.. ఫీజు బకాయిలతో వేలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోయాయని పేర్కొన్నారు. తెలంగాణలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Yashaswini Reddy | హామీలు అమలు చేయాలి

ఎన్నికల సమయంలో రేవంత్​రెడ్డి యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు కోరారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఉచిత స్కూటర్లు ఇవ్వాలన్నారు. విద్యాశాఖలో విఫలమైన రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. నిజంగా యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే, విద్యాశాఖ బాధ్యతలను కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డికి ఇవ్వాలన్నారు. యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారిని తప్పించి యువ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

ఇది కూడా చదవండి.. : Heavy Rains Alert | రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *