అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Jana Sena Party | జనసేన పార్టీ.. కార్యకర్తలను నాయకులుగా చేసేందుకు పుట్టిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు మీసాల శ్రీనివాస్‌రావు (Meesala Srinivas Rao) అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని(Nizamabad) ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన మాట్లాడారు.
Jana Sena Party | నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాల సన్నాహాక సమావేశం ఈనెల 8వ తేదీన జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేంద్రంలో, రాష్ట్రంలోనూ కీలకంగా మారబోతున్నారన్నారు.
8వ తేదీన తేదీన నిర్వహించబోయే సన్నాహాక సమావేశానికి రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరూ విచ్చేస్తున్నారని, కార్యకర్తలు అందరూ పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర అబ్జర్వర్ శర్మ, మీడియా ఇన్‌ఛార్జి దుంపటి శ్రీనివాస్, జిల్లా నాయకుడు గుండా సంతోష్, కోరుట్ల నాయకులు అజయ్, ఉప సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు రమేష్ బాసవేణి తదితరులు పాల్గొన్నారు.