Tirumala Car Accident | తిరుమల ఘాట్​లో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన కారు.. ఒకరి దుర్మరణం

డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతో కారు అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తా పడింది. ప్రమాదంలో కారు సుమారు 15 అడుగుల లోతులోకి దూసుకెళ్లింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala Car Accident | తిరుమల నుంచి దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల కారు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మొదటి ఘాట్‌రోడ్డులోని 22వ హెయిర్‌పిన్‌ బెండ్‌ సమీపంలో చోటుచేసుకుంది.

Tirumala Car Accident | నిద్రమత్తే కారణమా,,

ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతో కారు అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తా పడింది. ప్రమాదంలో కారు సుమారు 15 అడుగుల లోతులోకి దూసుకెళ్లింది.

కారులో బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఒక భక్తుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు సహా మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Kondapalli Ganesh Fraud | గణేష్ లడ్డూ పంచాడు.. పరిచయాలు పెంచుకున్నాడు.. కోట్లకు టోకరా వేశాడు.. సోషల్ మీడియాలో ప్రచారం వైరల్

ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌కు నిద్రమత్తు రావడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *