Hyderabad Heavy Rain | హైదరాబాద్​లో భారీ వర్షం..

హైదరాబాద్​ నగరంలో వాన దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ జామ్​ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Heavy Rain | హైదరాబాద్​ నగరంలో వాన దంచికొట్టింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వాన పడటంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది.

భారీ వర్షంతో నగరంలోని రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. రోడ్లపై నీరు నిలవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ జామ్ అయింది. ఉద్యోగులు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో గంటల కొద్ది ట్రాఫిక్​లో చిక్కుకొని నరకయాతన అనుభవించారు.

Hyderabad Heavy Rain | ట్రాఫిక్​ జామ్

hyderabad

ఆరామ్​ఘర్​ నుంచి మెహదిల్ రెస్టారెంట్ మార్గంలో వంతెన కింద నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా ఉన్నాయి. ప్రయాణికులు జాగ్రత్తగా వాహనం నడపాలని, వేగాన్ని తగ్గించాలని, సురక్షిత దూరాన్ని పాటించాలని పోలీసులు సూచించారు. గచ్చిబౌలి జంక్షన్ (Gachibowli Junction) వద్ద నీరు నిలిచిపోయింది. దీంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మాదాపూర్​ (Madhapur) పిల్లర్ నెం. 1724 వద్ద నీరు నిలిచిపోయింది. నీటిని తొలగించే మోటారును వెంనటే ప్రారంభించారు.

 

దీనిని కూడా చదవండి : Wine Shops Closure | మద్యంప్రియులకు షాక్​.. ఆ రోజు వైన్​షాపులు బంద్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *