Hitec City Traffic Loop | ఐటీ కారిడార్‌లో నిరంతర ప్రయాణమే లక్ష్యం.. కేబీఆర్ పార్క్ మోడల్‌లో వన్-వే లూప్ సిస్టమ్‌కు శ్రీకారం!

ప్రధాన కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనాలు సర్క్యులర్ ఫార్మాట్‌లో సాఫీగా కదులుతుండటం వల్ల ఇంధనం, సమయం ఆదా అవుతాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hitec City Traffic Loop | హైదరాబాద్ Hyderabad నగరం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బహుళ జాతి సంస్థలకు నిలయమైన ఐటీ కారిడార్. అయితే, అదే స్థాయిలో ప్రతినిత్యం ఆఫీసు వేళల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది అక్కడి ట్రాఫిక్.

రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెట్టేందుకు, ట్రాఫిక్ జామ్‌లకు ఒక ‘మాస్టర్ ప్లాన్’ ద్వారా శాశ్వత పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు.

Hitec City Traffic Loop | ‘సిగ్నల్ ఫ్రీ వన్-వే లూప్’

గతంలో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో నిరంతర వాహన రద్దీని తగ్గించేందుకు అమలు చేసిన ఏకముఖ ప్రయాణం (వన్-వే) తరహాలోనే, ఇప్పుడు ఐటీ కారిడార్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాలైన హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ జంక్షన్‌ల చుట్టూ “సిగ్నల్ ఫ్రీ వన్-వే లూప్” విధానాన్ని తీసుకురానున్నారు. ఈ విధానంలో వాహనాలు ఎక్కడా నిలవకుండా, వరుసగా ప్రవహిస్తూనే ఉంటాయి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Hitec City Traffic Loop | 4 ప్రధాన ‘బాటిల్‌నెక్‌’ పాయింట్లకు శాశ్వత చెక్!

ప్రస్తుతం వాహనాలు నెమ్మదిగా కదులుతూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడానికి కారణమవుతున్న 4 ప్రధాన జంక్షన్లను / బాటిల్‌నెక్‌ పాయింట్లను శాశ్వతంగా ఎత్తివేయాలని భావిస్తున్నారు.

Hitec City Traffic Loop | ప్రతిపాదిత ‘వన్-వే లూప్’ రూట్ మ్యాప్ ఇదే..

  • బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది.
  • బయోడైవర్సిటీ నుంచి ఐకియా (IKEA) రోటరీ మీదుగా రహేజా మైండ్‌స్పేస్ (సి-గేట్) వైపు సాగుతుంది.
  • అక్కడి నుంచి నాలెడ్జ్ సిటీ, డల్లాస్ సెంటర్ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది.
  • మై హోమ్ భూజా వద్ద రైట్ టర్న్ (కుడి మలుపు) తీసుకుని తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకుంటుంది.

Hitec City Traffic Loop | దీనివల్ల ఒరిగే ప్రయోజనాలేంటి?

ప్రస్తుతం ద్వైపాక్షిక (టూ-వే) రవాణా వల్ల జంక్షన్ల వద్ద ఆగడం, యూ-టర్న్‌లు తీసుకోవడం వల్ల నిమిషాల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. కొత్త వన్-వే లూప్‌తో రహదారి పూర్తి వెడల్పును సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.

ప్రధాన కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్స్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనాలు సర్క్యులర్ ఫార్మాట్‌లో సాఫీగా కదులుతుండటం వల్ల ఇంధనం, సమయం ఆదా అవుతాయి.

Hitec City Traffic Loop | త్వరలోనే క్షేత్రస్థాయిలో ట్రయల్ రన్!

ఈ ప్రతిపాదిత లూప్ విధానం అమలులోకి రాకముందు వాహనదారులకు అవగాహన కల్పించేందుకు, ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ (Trial Run) నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ ఆధారంగా లోటుపాట్లను సరిచేసి, దీనిని శాశ్వతంగా అమలు చేస్తారు.

ఈ సరికొత్త ప్లాన్ విజయవంతమైతే, ఐటీ కారిడార్‌లో ప్రతినిత్యం గంటల తరబడి సాగే నరకయాతన నుండి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, సాధారణ వాహనదారులకు లభించేది పెద్ద ఊరట అనడంలో సందేహం లేదు!

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *