Kaleshwaram Case Appeal | కాళేశ్వరం కేసు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు సర్కార్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kaleshwaram Case Appeal | కాళేశ్వరం కేసులో కేసీఆర్​, హరీశ్​రావులకు హైకోర్టు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. పీసీ ఘోష్​ కమిషన్​ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొదని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం (State Government) సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

పీసీ ఘోష్ కమిషన్​ (P.C. Ghosh Commission)ను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని న్యాయస్థానం పేర్కొంది. సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ధర్మాసనం అభిప్రాయ పడింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని తెలిపింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు (Supreme Court)లో అప్పీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. గురువారం కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం అంశంపై చర్చించనున్నారు. అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్​ వేయనున్నట్లు తెలిసింది.

Kaleshwaram Case Appeal

Kaleshwaram Case Appeal | రేపు కేబినెట్​ మీటింగ్​

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరగనుంది. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుపై ఇందులో ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణతో పాటు, ఆర్టీసీ సమ్మె తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో బస్సులు నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చర్చించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఇది కూడా చదవండి..: HYDRAA Action | రూ.90 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *