అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA Action | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భూముల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఓ వైపు చెరువులను రక్షిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలను కబ్జా చెరల నుంచి విడిపిస్తోంది.
రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) శంషాబాద్‌లో 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు బుధవారం కాపాడారు. దీని విలువ రూ.90 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రామంలోని సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీంట్లో నుంచి అటవీ అభివృద్ధి సంస్థకు గతంలో 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇంకా అక్కడ 9.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అది నిజాంలకు చెందిన భూమి అంటూ కొందరు ఆక్రమించే యత్నం చేశారు.
HYDRAA Action | హైకోర్టు స్టే ఉన్నా…
అది ప్రభుత్వ భూమి అని రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలో వ్యవహారం హైకోర్టు (High Court)కు చేరింది. తుది తీర్పు వచ్చే వరకు సదరు భూమిలో ఎలాంటి పనులు చేపట్టొద్దని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు స్టే ఉన్నా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి దానిని చదును చేసి లే అవుట్‌గా మార్చారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు అందాయి.

HYDRAA Action | హైడ్రా దృష్టికి తీసుకెళ్లడంతో..
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. మొయినుద్దీన్ ఖాన్ 9.05 ఎకరాల భూమిని చదును చేసి.. ప్రీకాస్ట్ గోడల ద్వారా ఆక్రమించినట్లు తేలింది. ఆక్రమణలను తొలగించాలని సూచించిన ఆయన పట్టించుకోలేదు. అంతేగాకుండా.. అక్కడ కొన్ని ఇంటి స్థలాలు అమ్ముకున్నాడు. దీంతో రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో హైడ్రా బుధవారం ఆపరేషన్ చేపట్టింది. 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసింది.
ఇది కూడా చదవండి..: Hyderabad Metro | హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు, ఇక నిమిషాల్లోనే ప్రయాణం!

