అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Metro | ఆర్టీసీ సమ్మె (RTC Strike) నేపథ్యంలో ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) రంగంలోకి దిగింది. మెట్రో స్టేషన్లలో భీభత్సమైన రద్దీని తట్టుకునేందుకు , ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించేందుకు రైళ్ల ఫ్రీక్వెన్సీని గరిష్ఠ స్థాయికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Hyderabad Metro | కీలక మార్పులు:
సమ్మె కాలం ముగిసే వరకు రోజంతా మొత్తం 56 మెట్రో రైళ్లను నిరంతరాయంగా నడపాలని అధికారులు నిర్ణయించారు. మియాపూర్ – ఎల్బీ నగర్ కారిడార్ మార్గంలో ప్రతి 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉండే నాగోల్ – రాయదుర్గ్ రూట్‌లో, ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకో రైలు నడపనున్నారు.
మెట్రో నిర్ణయంతో ఊరట:
సమ్మె కారణంగా బస్సులు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న నగరవాసులకు మెట్రో తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. గమ్యస్థానాలకు చేరుకోవడానికి వేచి ఉండే సమయం తగ్గడంతో పాటు, మెట్రో ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Special Trains | హైదరాబాద్ నుంచి 8 కొత్త వీక్లీ స్పెషల్ ట్రైన్లు

