HYDRAA Land Protection | రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA Land Protection | ఆక్రమణలపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్​ (Hyderabad) నగరం పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చెరల నుంచి కాపాడుతోంది. తాజాగా రూ.వేయి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.

రంగారెడ్డి (Rangareddy) జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లోని 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 42లో మెట‌ల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్‌కు వెళ్లే మార్గంలో అత్యంత విలువైన భూమిని కాజేయాల‌ని కొంత‌మంది ప్ర‌య‌త్నించారు. అక్క‌డ రెండు తాత్కాలిక షెడ్డులు వేసి ఒక గ‌దిని కూడా నిర్మించారు.

HYDRAA Land Protection | ఆక్రమణల తొలగింపు

ఐదు ఎక‌రాల చుట్టూ రేకుల షీట్ల‌తో ప్ర‌హ‌రీ కూడా నిర్మించే క్ర‌మంలో హైడ్రాకు రెవెన్యూ శాఖ నుంచి ఫిర్యాదు అందింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూమి త‌న‌దిగా చెబుతూ ఎవ‌రినీ అటువైపు రానీయ‌కుండా అడ్డుకుంటున్న ప‌రిస్థితుల్లో శేరిలింగంప‌ల్లి రెవెన్యూ అధికారుల విజ్ఞ‌ప్తి మేర‌కు హైడ్రా రంగంలోకి దిగింది. రెండు తాత్కాలిక షెడ్డుల‌తో పాటు.. నిర్మించిన గ‌దితో పాటు ఫెన్సింగ్‌ను హైడ్రా తొల‌గించింది. మొత్తం ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన త‌ర్వాత 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది.

దీనిని కూడా చదవండి : Fake Number Plates | నకిలీ నంబర్​ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *