అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medical Negligence | భద్రాద్రి జిల్లా (Bhadradri District)లో గుండాలలో వైద్యుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. బాలింత చితాభస్మంలో కత్తెర కన్పించడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుండాల మండలం శంభూనిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ(21)కు ఈ నెల 13న పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌నర్సు కాన్పు చేశారు. వనజ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండటం, వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Medical Negligence | తల్లీబిడ్డలు మృతి
ఆస్పత్రికి వెళ్లిన తర్వాత పరీక్షించిన వైద్యులు శిశువు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తల్లి పరిస్థితి విషమించినట్లు గుర్తించి.. ఖమ్మం ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని సూచించారు. ఖమ్మం వెళ్తుండగా మార్గంమధ్యలో తల్లి వనజ కూడా మృతిచెందింది.
Medical Negligence | చితాభస్మంలో కత్తెర
ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. గురువారం వారి చితాభస్మం సేకరించడానికి వెళ్లారు. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉపయోగించే కత్తెర లభ్యం కావడంతో వారు షాక్ అయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లీబిడ్డలు మరణించారని కుటుంబసభ్యుల ఆరోపించారు. అందుకు ఈ కత్తెర నిదర్శనమని మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించి ప్రభుత్వం గుండాల వైద్యాధికారిణిని సస్పెండ్ చేసింది.
ఇది కూడా చదవండి..: Telangana Registration Services | రిజిస్ట్రేషన్ శాఖ సంచలన నిర్ణయం.. రిజిస్ట్రేషన్ల నిలిపివేత