అక్షరటుడే, వెబ్డెస్క్: Nalgonda Road Accident | నల్గొండ జిల్లా (Nalgonda District)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దవూర – నాగార్జునసాగర్ హైవేపై ముత్యాలమ్మగూడెం వద్ద రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.
Nalgonda Road Accident | రెండు కార్లు ఢీకొన్నాయి
ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.రామన్నగూడెం (Ramanna Gudem) వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నాగార్జున సాగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Sai Krishna Missing Case | సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. సీఐ నాగరాజుపై కేసు నమోదు