Container Crash House | ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్.. ఒకరి మృతి

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కంటైనర్​ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Container Crash House | ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపైకి కంటైనర్​ రూపంలోకి మృత్యువు దూసుకొచ్చింది. నల్గొండ జిల్లా (Nalgonda District) వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

బుగ్గబావిగూడెం గ్రామం (Buggabavigudem village)లో వెంకన్న అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్నాడు. అయితే ఆదివాం రాత్రిపూట ఓ మినీ కంటైనర్​ అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. వెంకన్నపైకి వాహనం ఎక్కడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Container Crash House | ఓఆర్​ఆర్​పై రోడ్డు ప్రమాదం

హైదరాబాద్​ ఔటర్​ రింగ్​ రోడ్డుపై సోమవారం ఉదయం ఓ ఇన్నోవా కారు డివైడర్​ను, మరో కారును ఢీకొంది. నగర శివారు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నోవా కారు డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Nalgonda Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *