అక్షరటుడే, కామారెడ్డి: Missing Case | షాపింగ్ కోసమని పిల్లలతో కలిసి బయలుదేరిన మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy)పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.
Missing Case | ఇంటికి రాకపోవడంతో..
పట్టణ సీఐ నరహరి (CI Narahari) తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్ గ్రామానికి చెందిన యాడారం శ్యామల తన ముగ్గురు పిల్లలు బిందు (17), శివ (13), దివిజ (8)తో కలిసి ఉదయం కామారెడ్డి పట్టణానికి షాపింగ్‌కు వెళ్తున్నామని ఇంటినుంచి బయలు దేరింది. షాపింగ్ పూర్తి చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని తన తమ్ముడి ఇంటికి వెళ్లింది. అనంతరం ఇంటికి వెళ్తామని చెప్పి సాయంత్రం ఆటోలో బస్టాండుకు పిల్లలతో కలిసి బయలు దేరింది. రాత్రి 8 గంటల బసుకు ఇంటికి వస్తున్నానని చెప్పినా.. ముగ్గురు ఇంటికి రాకపోవడంతో భర్త భానుప్రకాశ్ కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
ఇది కూడా చదవండి..: ATM Card Fraud | ఏటీఎం కార్డును మార్చేసి రైతును దోచేసిన అగంతకుడు..