Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​కు యువకుడి బలి..

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలని అత్యాశతో అప్పుల ఊబిలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఆన్​లైన్​ బెట్టింగ్ మరో వ్యక్తిని బలి తీసుకుంది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.

Online Betting | అప్పులు తీర్చలేక..

పట్టణ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణం (Kamareddy town)లోని ఎంఆర్ కాలనీకి చెందిన అంకం క్రాంతి కుమార్ ఆన్​లైన్​ బెట్టింగ్​కు అలవాటుపడ్డాడు. రూ.12 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పుతీర్చే మార్గం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులోని చర్చి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు కుమారులు విజ్ఞేష్, వినాయక్, కూతురు సంయుక్త ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Online Betting

ఇది కూడా చదవండి..: Missing Case | ముగ్గురు పిల్లలతో తల్లి అదృశ్యం.. విచారణ చేపడుతున్న పోలీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *