Student Union Harassment | విద్యార్థి సంఘాల ఆగడాలను అరికట్టాలి..

జిల్లాలో విద్యార్థి సంఘాల దౌర్జన్యాలను అరికట్టాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) ప్రతినిధులు కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Student Union Harassment | జిల్లాలో విద్యార్థి సంఘాల దౌర్జన్యాలను అరికట్టాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) ప్రతినిధులు కోరారు. ఈ మేరకు అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్​కు గురువారం వినతిపత్రం అందజేశారు.

Student Union Harassment | కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ..

ప్రైవేట్ పాఠశాలల్లో ‘నో ప్రాఫిట్ నో లాస్’ కింద పుస్తకాలు విక్రయించుకోవచ్చని కోర్టు ద్వారా ఉత్తర్వులు ఉన్నప్పటికీ కొన్ని విద్యార్థి సంఘాలు (Student Unions) పాఠశాలలపై దౌర్జన్యం చేస్తున్నాయన్నారు. పాఠశాలలోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేయడం.. ఉపాధ్యాయులను, మేనేజ్​మెంట్​ను బెదిరించడం ద్వారా ఇబ్బందులను కలగజేస్తున్నాయన్నారు.

మండల స్థాయిలో సమస్యలు ఉంటే ఎంఈవోకు అలాగే జిల్లాస్థాయిలో ప్రైవేట్ పాఠశాలల్లో ఇబ్బందులు ఉంటే డీఈవో (DEO)కు ఫిర్యాదు చేయాల్సి ఉండగా నేరుగా విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలల పైకి దాడికి రావడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. పాఠశాలలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులకు అడిగే హక్కు ఉంటుందని.. కానీ విద్యార్థి సంఘాలు ఆ హక్కును తమపై వేసుకొని దౌర్జన్యానికి దిగబడడం బాధాకరమన్నారు.  జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లోకి కొత్త, అనుమానిత వ్యక్తులు, విద్యార్థి సంఘాల నాయకులు రాకుండా కట్టడి చేయలాని.. విద్యార్థులకు, పాఠశాలలకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ప్రతినిధులు జయసింహా గౌడ్​, సంజీవ్​రావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Online Betting | ఆన్​లైన్​ బెట్టింగ్​కు యువకుడి బలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *