నిజామాబాద్ నిజామాబాద్ క్రైం: Nizamabad Murder | నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని కుటుంబీలకులంతా కలిసి హత్య చేశారు.
Nizamabad Murder | మోపాల్ మండలంలో..
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలంలోని అమ్రాబాద్ జీపీ పరిధిలోని కోక్యా నాయక్ తండాలో బానోత్ హరి నిత్యం మద్యం తాగేవాడు. అయితే మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంలో ఆయన కుటుంబీకులంతా కలిసి మంగళవారం రాత్రి బానోత్ హరి గొంతు పిసికి హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: YSR Birth Anniversary | ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి