Vasavi Matha Jayanti | కలెక్టరేట్​లో ఘనంగా వాసవీ మాత కన్యకా పరమేశ్వరి జయంతి

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vasavi Matha Jayanti | వాసవీ మాత కన్యకా పరమేశ్వరి జయంతిని నిజామాబాద్​ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైశాఖ శుక్ల పక్ష దశమిని పురస్కరించుకుని ఉత్సవాలను జరిపారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సాయాగౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి, వాసవీ మాత కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి పూలమాల వేశారు.

Vasavi Matha Jayanti | ఉత్సవాలకు ప్రభుత్వం ప్రాధాన్యత

ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారికంగా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతియేటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అన్నివర్గాల వారి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. కన్యకా పరమేశ్వరి మాత దేహ త్యాగం ద్వారా సహనం, శాంతిని ప్రబోధించారని, స్త్రీ శక్తి ఔన్యత్యాన్ని చాటారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, వాసవీ క్లబ్ ప్రతినిధులు, వైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Vasavi Matha Jayanti

Vasavi Matha Jayanti02

ఇది కూడా చదవండి..: Vasavi Idol Procession | నగరంలో భక్తిశ్రద్ధలతో వాసవి కన్యకాపరమేశ్వరి విగ్రహ ఊరేగింపు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *