Kamareddy Municipal Corruption | మున్సిపల్ బిల్లుల్లో రూ.కోట్లల్లో అవినీతి.. కలెక్టర్‌కు బీజేపీ కౌన్సిలర్ల ఫిర్యాదు

కామారెడ్డి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పడిన అనంతరం బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరిగిందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Corruption | కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పడిన అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపుల్లో అవినీతి జరిగిందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

Kamareddy Municipal Corruption |రూ.1.70కోట్లు అవినీతి..

ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ.. రూ.1.70 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. నూతన పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.5,92,91,364 ఖర్చు కాగా, అందులో 75 బిల్లులకు సంబంధించి రూ.1,13,14,566 చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని వారన్నారు. అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.71,28,937 ఖర్చు చేయగా, అందులో 5 బిల్లులకు రూ.5986,353 చెల్లింపుల్లో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంతమంది ప్రజా ప్రతినిధుల హస్తం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సరైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ ఫిర్యాదుపై సరైన స్పందన రాకపోతే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ కౌన్సిలర్లు హెచ్చరించారు.

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *