అక్షరటుడే, కామారెడ్డి: Traffic Rules | ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతోనే ప్రాణాలకు రక్షణ ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని మరమ్మతుల అనంతరం ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను శనివారం ప్రారంభించారు.
Traffic Rules | ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్‌కు బాధ్యతలు..
ఈ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్‌ను ఎస్పీ స్వయంగా ఆయన స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీ, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవుట్‌పోస్ట్‌ను ఆధునీకరించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, వేగవంతమైన స్పందనతో విధులు నిర్వహించాలని సూచించారు. రహదారులపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ వాతావరణం కల్పించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
Traffic Rules | ప్రజలకు సేవలందించాలి
ట్రాఫిక్ పోలీసులు చట్టాలను అమలు చేయడమే కాకుండా ప్రజలకు సేవలందించే బాధ్యతను కూడా నిర్వర్తించాలని సీపీ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య కేంద్రాలు, ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని కోరారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘించడం వంటివి ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులు, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ సిఐ నరహరి, ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్, టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: IBPS Clerk Recruitment | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల