అక్షరటుడే, నిజామాబాద్సిటీ: Nizamabad Oora Panduga | నగరంలో ఆదివారం జరగనున్న ఊరపండుగకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయని మేయర్ ఉమారాణి (Mayor Umarani) పేర్కొన్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆమె ఊరేగింపు వెళ్లే ప్రాంతాలను ఖిల్లా వద్ద శారదాంబ గద్దెను శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Nizamabad Oora Panduga | భక్తులకు ఇబ్బంది లేకుండా..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, ప్రధాన మార్గాల్లో రోడ్ల మరమ్మతులు మరియు వీధి దీపాల ఏర్పాటు సక్రమంగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు, హెల్త్ క్యాంపులు, తాగునీటి చలివేంద్రాలు, షామియానాలు సిద్ధం చేయాలని సూచించారు. శాంతిభద్రతలకు, సోదరభావానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రజలందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్, సర్వసమాజ్ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్, కో-కన్వీనర్ ఆదే ప్రవీణ్, కో-ఆప్షన్ మెంబర్ నరేందర్ సింగ్, కాంగ్రెస్ నాయకులు కరాటే రమేష్, బంటు బలరాం, ఆమ రాజు, లవంగ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Banswada Stray Dogs | వీధి కుక్కల బెడదపై అధికారుల ప్రత్యేకచర్యలు