Pallaki Seva Indur Tirumala | నర్సింగ్​పల్లి ఇందూరు తిరుమలలో భక్తిశ్రద్ధలతో శ్రీవారి పల్లకీసేవ

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Pallaki Seva Indur Tirumala | నర్సింగ్​పల్లిలోని ఇందూరు తిరుమల(indur tirumala) గోవింద వనమాల క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారిని పల్లకీపై (pallaki seva) ఊరేగించి ప్రత్యేక ఊంజల సేవ నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజు గర్భిణులకు ఇచ్చే దివ్య ఔషధ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని సైతం కొనసాగించారు.

Pallaki Seva Indur Tirumala | పదేళ్లుగా..

ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ.. ఇందూరు(Induru) తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా పదేళ్లుగా గర్భిణులకు దివ్య ఔషధాన్ని ఇస్తున్నామని అన్నారు. ఈ ఔషధం సేవించిన మాతృమూర్తులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు పుట్టిన బిడ్డలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారని అన్నారు. ఈ ఆలయంలో ఇస్తున్న ప్రతి ఔషధం స్వామి వారి ప్రసాదంగా మారుతుందని అర్చక స్వాములు సంపత్ కుమార్ ఆచార్య అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ‘మురళి వేణు గాన’ విద్వాంసులు (ఫ్లూటిస్ట్) (Flutist) ఈటీవీ(ETV) ఫేమ్ యుగంధర్ పాల్గొని స్వామి వారికి కీర్తనలను వేణుగానంలో భక్తులకు వినిపించారు. యుగంధర్ వేణు గానానికి భక్తులందరూ ముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు నర్సారెడ్డి, నరాల సుధాకర్(narala sudhakar), భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: RTC Workers Issues | ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *