అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Fuel Price Hike | దేశంలో ఇంధన ధరలు (Fuel Price) త్వరలో పెరగనున్నట్లు సమాచారం. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు (Elections) ముగియడంతో రేట్లు పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. అయితే మొన్నటి వరకు రేట్ల పెంపు ఆలోచన లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మాట మార్చింది. భవిష్యత్లో రేట్లు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు సమాచారం. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో సుమారు నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగిన, తగ్గిన దేశంలో మాత్రం రేట్లను పెంచలేదు. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తడంతో ముడి చమురు ధరలు (Crude Oil) భారీగా పెరిగాయి. దీంతో చాలా దేశాల్లో ఇంధన ధరలను పెంచారు. భారత్లో మాత్రం ప్రీమియ పెట్రోల్ ధరలను మాత్రమే స్వల్పంగా పెంచారు. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను అలాగే ఉంచారు. అయితే శుక్రవారం కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం భారీగా పెంచింది. దీంతో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలను సైతం పెంచనున్నట్లు సమాచారం.
Fuel Price Hike | పెంచే అవకాశం ఉంది
సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అవకాశాన్ని కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ఇంధన వ్యయం పెరిగినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు దేశీయ ఎల్పీజీ ధరలను కూడా పెంచడం లేదని పరిశ్రమ తరఫున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వ్యయానికి అనుగుణంగా కమర్షియల్ ఎల్పీజీ, ఇండస్ట్రియల్ డీజిల్, 5 కేజీల ఎల్పీజీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు విక్రయించే జెట్ ఫ్యూయల్ ధరలను పెంచాయి. అయితే త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ.4 నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దీనిని కూడా చదవండి : Nitin Gadkari | పెట్రోల్, డీజిల్ బండ్లకు భవిష్యత్ లేదు.. హైడ్రోజన్, ఇథనాల్ ఇంధనాలకు మారాలి : నితిన్ గడ్కరీ

