Delhi Airport Marijuana Seizure | గీజర్​లో గంజాయి రవాణా.. పట్టుకున్న కస్టమ్స్​ అధికారులు

గీజర్​లో దాచి రవాణా చేస్తున్న గంజాయిని ఢిల్లీ ఎయిర్​పోర్టులో కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Airport Marijuana Seizure | ఢిల్లీ ఎయిర్​పోర్టు (Delhi Airport)లో కస్టమ్స్​ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇతర దేశాల నుంచి గంజాయి తీసుకు వస్తున్నట్లు కస్టమ్స్​ అధికారులకు (Customs Officers) సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో కౌలాలంపూర్ (Kuala Lumpur) నుండి D7-182 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఆ ప్రయాణికులు తమ సాధారణ లగేజీతో పాటు రెండు కొత్త గీజర్‌లను కూడా తీసుకువెళుతున్నట్లు అధికారులు గమనించారు.

Delhi Airport Marijuana Seizure | దొరకకుండా..

సుదీర్ఘ విచారణ, మొబైల్ ఫోన్ సంభాషణల పరిశీలన తర్వాత, ఆ గీజర్‌లలో ఉన్న వస్తువుల పట్ల అధికారులకు అనుమానం కలిగింది. దీంతో ఆ పరికరాలను ఎక్స్-రే పరీక్షకు గురిచేయగా, వాటి అంతర్గత నిర్మాణంలో ఏదో పదార్థం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత రెండు గీజర్‌లను విడదీసి చూడగా అందులో గంజాయి ఉంది. అధికారులకు చిక్కకుండా నిందితులు పక్కాగా గీజర్​లో లోపల దాచిన 145 వాక్యూమ్-సీల్డ్ ప్యాకెట్లను కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాకెట్లను పరిశీలించగా, అందులో హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic Cannabis) ఉంది.

Delhi Airport Marijuana Seizure | రూ.5.38 కోట్లు

Delhi Airport Marijuana Seizure

స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యం మొత్తం బరువు 15.38 కిలోలుగా అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకు అంచనా విలువ సుమారు రూ.5.38 కోట్లు ఉంటుంది. స్వాధీనం చేసుకున్న గంజాయిని NDPS చట్టం ప్రకారం జప్తు చేశారు. ఆ ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి..: Air India Aircraft Damage | విమానాలను ఢీకొన్న గ్రౌండ్ సపోర్టు పరికరాలు.. 3 ఫ్లైట్లు ధ్వంసం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *