TVK Election Results | తమిళనాడులో టీవీకే తుఫాన్.. విజయ్ పార్టీ సునామిని ముందుగానే ఊహించిన ఏకైక ఎగ్జిట్ పోల్

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TVK Election Results | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamilnadu Assembly Elections) ఫలితాల్లో భారీ సంచలనం చోటుచేసుకుంటోంది. దశాబ్దాలుగా అధికారాన్ని పంచుకున్న డీఎంకే, ఏడీఎంకే పార్టీలను వెనక్కి నెట్టి, నటుడు విజ‌య్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అప్రతిహతంగా ముందుకుసాగుతోంది.

తొలి రౌండ్ల నుంచే స‌త్తా చాటుతూ 100కుపైగా స్థానాల్లో ఆధిక్యం కొనసాగించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటివరకు వెలువడిన చాలా ఎగ్జిట్ పోల్స్ టీవీకేకు గణనీయమైన ఓటు శాతం వస్తుందని అంచనా వేసినా, సీట్ల పరంగా పెద్ద విజయం సాధించదని భావించాయి. అయితే వాస్తవ ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా వస్తున్నాయి. టీవీకే పార్టీ అనూహ్యంగా భారీ స్థాయిలో సీట్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.

TVK Election Results | ఎలా గెస్ చేశారు..

ఒక్క యాక్సిక్ మై ఇండియా (Axis My India) సర్వే మాత్రం టీవీకే పార్టీ 98 నుంచి 120 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేసింది. యువతలో భారీ స్థాయిలో మద్దతు, మహిళల ఓటు బ్యాంకు, పట్టణ ఓటర్ల ఆకర్షణ ఇవన్నీ టీవీకే విజయానికి కీలక కారణాలుగా ఆ సర్వే పేర్కొంది. సర్వే ప్రకారం, తమిళనాడులో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లలో సుమారు 67 శాతం మంది టీవీకే వైపు మొగ్గు చూపారు. మహిళల్లో కూడా గణనీయమైన మద్దతు లభించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలు, ఓబీసీ ఓటర్లలో కూడా టీవీకేకు మంచి స్పందన వచ్చినట్లు వెల్లడించింది.

TVK Election Results | తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పు

ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐఏడీఎంకే రెండో స్థానంలో ఉండగా, డీఎంకే మూడో స్థానానికి పడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇది తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. సినిమాల్లో సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన విజయ్, ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ప్రభావం చూపుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఆయన కేవలం కింగ్ మేకర్‌గా కాకుండా ‘కింగ్’గానే అవతరిస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు. టీవీకే పార్టీ (TVK Party) ఒంటరిగా పోటీ చేసి ఈ స్థాయిలో విజయాన్ని సాధించడం ప్రత్యేకతగా నిలిచింది. గత 50-60 ఏళ్లుగా రెండు ప్రధాన పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి తమిళనాడు ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని ఈ ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇక తుది ఫలితాల్లో టీవీకే పార్టీ ఎన్ని స్థానాలు సాధించి చరిత్ర సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: India Election Shocks| సొంత నియోజకవర్గాల్లో వెనుకబడ్డ హేమాహేమీలు.. ముగ్గురు సీఎంలకు షాక్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *