అక్షరటుడే వెబ్‌డెస్క్: Mamata Banerjee Convoy | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్ర పరిణామం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బీజ్పూర్ పరిధిలో లాకప్‌లో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త బిర్జూ కేఓట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఆమె కాన్వాయ్‌పై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. మమతా బెనర్జీ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు ‘చోర్.. చోర్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆమె వాహనంపైకి రాళ్లు, పాదరక్షలు, నీళ్ల బాటిళ్లు, బురదను విసిరారు. దొరికిన వస్తువులతో ఒక్కసారిగా వాహనంపై దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Mamata Banerjee Convoy | తల పగిలిపోయేదని..
ఈ ఘటనపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడే చూస్తుండగానే అసాంఘిక శక్తులు తన కారుపై పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశాయని ఆరోపించారు. ఈ దాడి ఏ స్థాయిలో జరిగిందంటే.. ఒకవేళ తాను కారు అద్దాలు తెరిచి ఉంటే తన తల పగిలిపోయేదని, ప్రాణాలు కోల్పోయి ఉండేదామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక పోలీసుల నిర్లక్ష్యంతో పాటు ప్రత్యర్థి పార్టీల ప్రమేయం ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాహనంపై దాడి
నార్త్ 24 పరగణాస్ ప్రాంతంలో పోలీస్ కస్టడీలో మరణించిన టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా దాడి చేసిన దుండగులు
పెద్ద పెద్ద ఇటుకలతో, రాళ్లతో గూండాలు దాడి చేశారని ఆరోపించిన మమతా బెనర్జీ pic.twitter.com/eJwzUYxXel
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2026
ఇది కూడా చదవండి: Plane Crash | కూలిపోయిన శిక్షణ విమానం