Sriramsagar Tourist Rush | ఎస్సారెస్పీపై పర్యాటకుల సందడి

వరుసగా మూడు రోజుల పాటు సెలవులు కలిసిరావడంతో శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు పర్యాటకులు తరలి వచ్చారు.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Sriramsagar Tourist Rush | వరుసగా మూడు రోజుల పాటు సెలవులు కలిసిరావడంతో పోచంపాడ్‌ ప్రాజెక్ట్​పై  (Pochampad Project) సందడి నెలకొంది. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం పర్యాటకులు ప్రాజెక్టుకు తరలివచ్చారు.

Sriramsagar Tourist Rush | గుర్రం సవారీపై..

ఆదిలాబాద్(Adilabad), కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు కుటుంబ సమేతంగా భారీగా తరలివచ్చారు. డ్యామ్‌పై నుంచి వీస్తున్న చల్లని గాలులు, కళకళలాడుతున్న జలాశయ అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు డ్యామ్‌పై సేదతీరుతూ ప్రకృతి రమణీయతను తిలకించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రాంగణంలో అందుబాటులో ఉన్న గుర్రపు సవారీలు చిన్నారులను అమితంగా అలరించాయి.

​Sriramsagar Tourist Rush | పోలీసుల బందోబస్తు..

​సెలవుల కారణంగా భారీగా పర్యాటకులు తరలిరావడంతో ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. డ్యామ్ దిగువ భాగం, ప్రమాదకర ప్రాంతాల వైపు పర్యాటకులు వెళ్లకుండా మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అధికారులు పదేపదే సూచిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ​

ఇది కూడా చదవండి: A little more of Rudhra’s world… #Varanasi

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *