Sriramsagar Project Water Level | శ్రీరాంసాగర్​లో 40 టీఎంసీల నీరు.. ఆశాజనకంగా నీటిమట్టం

తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​లో ఎగువ నుంచి వరద వస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా: Sriramsagar Project Water Level | తెలంగాణ (Telanagana) వరప్రదాయిని శ్రీరాంసాగర్​లో ఎగువ నుంచి వరద వస్తోంది. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఇన్​ఫ్లో కొనసాగుతోంది.

Sriramsagar Project Water Level | ప్రాజెక్టులోకి 13,465 క్యూసెక్కులు

మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టుకు (Pochampad Project) వరద నీరు కొనసాగుతోంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో చేరుతోంది. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 13,465 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.

Sriramsagar Project Water Level | గతేడాది నీటిమట్టం దాటి​..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,078.80 అడుగుల వద్ద 40.907 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 1,078.30 అడుగుల వద్ద 40.583 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు కలిపి మొత్తం 993 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.

 

ఇది కూడా చదవండి: Toxic Trailer Review | టాక్సిక్ ట్రైలర్ రివ్యూ : నాలుగు నిమిషాల్లో పిచ్చెక్కించిన టాక్సిక్ వరల్డ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *