House Arson | రుణదాత ఇంటికి నిప్పు.. నిందితుడి అరెస్టు

అప్పిచ్చి తిరిగి చెల్లించాలని అడిగినందుకు ఇంటికి నిప్పంటించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్​ పోలీస్​స్టేషన్​లో ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ వివరాలు వెల్లడించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: House Arson | అప్పిచ్చి తిరిగి చెల్లించాలని అడిగినందుకు రుణదాత ఇంటికి నిప్పంటించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్​ పోలీస్​స్టేషన్​లో(Armoor Police) ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​ వివరాలు వెల్లడించారు.

House Arson | ఆర్మూర్​ మండలం పిప్రి గ్రామంలో..

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన అబ్దుల్ బారి డిచ్​పల్లి (Dichpally) తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) పీహెచ్​డీ చదువుతున్నాడు. గ్రామానికి చెందిన రాజమల్లు దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకున్నాడు.

అయితే తీసుకున్న అప్పు తిరిగిచ్చిన బారీ వడ్డీ కోసం చెక్కు రాసిచ్చాడు. ఎనిమిది నెలల తర్వాత డ్రా చేసుకోవాలని చెప్పగా.. అత్యవసర పరిస్థితుల్లో రాజమల్లు వడ్డీ డ్రా చేసుకున్నాడు. దీంతో కోపగించుకున్న బారీ.. రాజమల్లు ఇంటికి నిప్పంటించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్​ నగర్ కాలనీలో తన అన్న ఇంటి వద్ద ఉన్న అబ్దుల్​ బారిని శనివారం అరెస్టు​ చేశారు. అనంతరం రిమాండ్​కు తరలించినట్లు ఎస్​హెచ్​వో తెలిపారు.

tt

ఇది కూడా చదవండి: Suvendu Adhikari Bengal | ‘మార్పు’ దిశగా బెంగాల్‌ అడుగులు.. సీఎం సువేందు భవిష్యత్​ వ్యూహం ఏమిటంటే..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *