Dead Body in Car | కారు డిక్కీలో మహిళ మృతదేహం కలకలం

కారు డిక్కీలో మహిళ మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dead Body in Car | కారు డిక్కీలో మహిళ మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా (Hanumakonda District) ఎల్కతుర్తిలో చోటు చేసుకుంది.

ఎల్కతుర్తి బస్టాండ్​ సమీపంలోని పార్క్​ వద్ద రెండు రోజులుగా కారు పార్క్​ చేసింది. ఆ కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి కారులో పరిశీలించగా.. డిక్కీలో కుళ్లిన స్థితిలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని మూటకట్టి డిక్కీలో పెట్టారు.

Dead Body in Car | కారు నంబర్​ ఆధారంగా..

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కారు నంబర్​ ఆధారంగా యజమాని సురేందర్​ను అదుపులోకి తీసుకున్నారు. తన నుంచి మానస స్నేహితుడు వినోద్​ కారును అద్దెకు తీసుకున్నట్లు అతడు తెలిపాడు. దీంతో వినోద్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తాము కరీంనగర్​లో గదిలో ఉన్నప్పుడు ఆమెకు ఫిట్స్​ వచ్చినట్లు నిందితుడు చెప్పారు. దీంతో ఆమె చనిపోయిందన్నారు. భయంతో మృతదేహాన్ని కారులో వదిలి వెళ్లినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీనిపై ఎల్కతుర్తి పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Revanth Reddy US Tour | సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బ్రేక్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *