అక్షరటుడే వెబ్‌డెస్క్: Bandi Sanjay | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు ( N Ramchander Rao )అరెస్ట్ కావడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించడానికి, నిరసన తెలపడానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
Bandi Sanjay | బండి సంజయ్ ప్రశ్నలు..
దాడులకు పాల్పడే వారిని కాపాడటమేనా కాంగ్రెస్ చెబుతున్న ‘ఇందిరమ్మ రాజ్యం’? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇల్లు ధ్వంసమైనా నిందితులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. అలాగే, హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సీరియస్ అయ్యారు. ప్రభుత్వం, పోలీసులను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay | విడుదల చేయాలని డిమాండ్..
అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు ఇతర నాయకులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, భవిష్యత్తులో జరిగే ప్రతి పరిణామానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని జోస్యం చెప్పారు.
ఇది కూడా చదవండి: Eatala Rajender | రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు : ఎంపీ ఈటల