అక్షరటుడే వెబ్‌డెస్క్: AP DSC Recruitment 2026 | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) డీఎస్సీ (DSC) నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేసిన ఆయన.. అత్యంత బాధ్యతగా కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు సభకు వెల్లడించారు.
AP DSC Recruitment 2026 | విప్లవాత్మక సంస్కరణలు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు మంత్రి లోకేశ్ వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు సింగపూర్, ఫిన్‌లాండ్ వంటి విదేశాలకు పంపిస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని, వ్యవస్థను ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
AP DSC Recruitment 2026 | రిజర్వేషన్ల అమలు..
డీఎస్సీ నియామకాల ప్రక్రియకు సంబంధించి కొందరు న్యాయస్థానాల్లో 336 కేసులు దాఖలు చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. నియామకాల్లో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను పాటించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేశామని వెల్లడించారు. అలాగే, టెట్ (TET) పరీక్షకు 3.68 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1.87 లక్షల మంది అర్హత సాధించినట్లు అసెంబ్లీ వేదికగా వివరాలు అందజేశారు.
ఇది కూడా చదవండి: India vs Sri Lanka | విజృంభించిన భారత బౌలర్లు.. కష్టాల్లో శ్రీలంక