Sai Krishna Missing Case | సాయికృష్ణ మిస్సింగ్​ కేసు.. సీఐ నాగరాజుపై కేసు నమోదు

ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసు అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజుపై కేసు నమోదు అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Sai Krishna Missing Case | ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో పోలీసు అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజు (CI Nagaraju)పై కేసు నమోదు అయింది. నేడు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గాదె సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో విజయవాడలోని కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. సీఐను విచారించిన అనంతరం మరికొందరు పోలీసులపైనా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ (YS Jagan) రంగ ప్రవేశంతో ఈ కేసుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం సమీక్షించారు. సీఐ నాగరాజును సస్పెండ్​ చేయాలని ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు ఆయనను ఇప్పటికే సస్పెండ్​ చేశారు. తాజాగా అరెస్ట్​ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Sai Krishna Missing Case | ఏం జరిగిందంటే?

సాయికృష్ణ (25) అనే యువకుడిని మే 9న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతను ఇంటికి రాలేదు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో సాయికృష్ణ చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు జూన్ 29 లోపు సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది.

Sai Krishna Missing Case | సీఐపై కేసు నమోదు

సాయికృష్ణ తల్లితో గురువారం రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ సీపీ రాజశేఖర్‌ మాట్లాడారు. ఆమె సీఐపై ఫిర్యాదు చేయగా వెంటనే నాగరాజుపై 127 (4), 127 (6), 103 (1), 238 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద నమోదు చేశారు. కాగా సాయి కృష్ణను పోలీసులు కొట్టి చంపారని.. బాడీని కృష్ణలంక శ్మశాన వాటికలో కాల్చేశారని.. ఆధారాలు లేకుండా చేశారని వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసిన చేశారు.

ఇది కూడా చదవండి..: Prakasam District Tragedy | ప్రకాశం జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *