Power Supply | నిరంతర విద్యుత్​ సరఫరాలకు ట్రాన్స్​కో హైపవర్​ ప్లాన్​..: ఎస్​ఈ పీవీ రాజేశ్వర్​రావు

జిల్లావ్యాప్తంగా నిరంతర విద్యుత్​ సరఫరాలో అంతరాయాలు తొలగించేందుకు ‘హైపర్’ ప్లాన్​ రూపొందించినట్లు నిజామాబాద్​ ట్రాన్స్​కో ఎస్​ఈ పీవీ రాజేశ్వర్​ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Power Supply | జిల్లావ్యాప్తంగా నిరంతర విద్యుత్​ సరఫరాలో అంతరాయాలు తొలగించేందుకు ‘హైపర్’ ప్లాన్​ రూపొందించినట్లు నిజామాబాద్​ ట్రాన్స్​కో(nizamabad electricity) ఎస్​ఈ పీవీ రాజేశ్వర్​ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

Power Supply | భారీ వర్షాలు, ఈదురుగాలులు..

వర్షాకాలంలో (monsoon preparedness) ఈదురుగాలులు, భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అడ్వాన్స్ యాక్షన్ ప్లాన్​ను చేపట్టామని ఆయన తెలిపారు. టెక్నాలజీ సాయంతో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. హైపర్​ ‘HAIPER’ పేరుతో సిక్స్-స్టెప్ ఫార్ములాను తయారుచేశామని.. దీంతో విద్యుత్ అంతరాయాలను అధిగమించడానికి కృషి చేస్తున్నామన్నారు.

Power Supply | ‘హైపర్​’లో భాగంగా సిక్స్​ స్టెప్​ ఫార్ములా..

వానాకాలం సీజనల్​లో ట్రాన్స్​కో(transco haiper plan) జిల్లా ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్​ రూం ఏర్పాటు చేశామన్నారు. ఈ కంట్రోల్​ రూంలో సిబ్బంది నిరంతరంగా పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. జిల్లాలో ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే అక్కడికి చేరుకునేందుకు ముందస్తుగా సామగ్రి ఏర్పాటు ఉంటుందని.. అలాగే సిబ్బంది సైతం నియామకం జరిగిందన్నారు. సమస్య ఎక్కడ ఉందో అక్కడికి పక్కాగా చేరుకునేందుకు సమాచార వ్యవస్థను వినియోగించుకుంటామని తెలిపారు. విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించేందుకు ఫీల్డ్​లో యుద్ధప్రాతిపదికన, భద్రతా ప్రమాణాలతో కూడిన వేగవంతమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుకున్న సమయం లోపల విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించడం ఫైనల్​ టార్గెట్​ అని ఆయన పేర్కొన్నారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *