అక్షరటుడే, బోధన్: Snake Bite Death | ఎడపల్లి (Yedapalli)లోని అంబెంలో విషాదం నెలకొంది. ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని పాము కాటు వేయగా చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడు.
Snake Bite Death | మండలంలోని అంబెంలో ..
అంబెం గ్రామంలో సోమవారం తన ఇంట్లో గంగాకిషన్ నిద్రించగా.. ఇంట్లోకి ప్రవేశించిన పాము అతడికి కాటు వేసింది. దీంతో వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు అతడిని బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ అతడు మంగళవారం మృతి చెందాడు. గంగాకిషన్ మృతితో అంబెం గ్రామంలో విషాదం నెలకొంది.
ఇది కూడా చదవండి..: Nizam Sagar Flood | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్ట్.. నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద