అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizam Sagar Flood | నాగిరెడ్డిపేట మండంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. దీంతో నిజాంసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది.
Nizam Sagar Flood | 3,860 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar Project) పూర్తి స్థాయి నీటిమట్టం 1,405.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1401.32 అడుగులకు చేరింది. పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 12.857 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే రోజు 1404.43 అడుగులుగా నమోదైంది. స్పిల్‌వే గేట్లు, జెన్ కో, ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల లేదని, ఆవిరి రూపంలో 206 క్యూసెక్కులు మాత్రమే పోతుందని అధికారులు తెలిపారు. పోచారం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు నిజాంసాగర్‌కు చేరుతోంది. అటు సింగితం రిజర్వాయర్ కు 975 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరగా, అదే మొత్తాన్ని నిజాంసాగర్ ప్రధాన కాలువకు మళ్లిస్తున్నారు. కల్యాణి ప్రాజెక్టుకు 331 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు.
Nizam Sagar Flood | పోచారం ప్రాజెక్టుకు..
పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని పొంగి పొర్లుతుంది. మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టులోకి 2505 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. కాలువ ద్వారా 100 క్యూసెక్కులు వదులుతున్నారు. మిగతా నీరు డ్యామ్ నుంచి పొంగి మంజీరలో కలుస్తుంది. దిగువ ప్రాంత రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి..: Former Sarpanch Murder | వర్నిలో కలకలం.. మాజీ సర్పంచ్ దారుణ హత్య