నిజామాబాద్Collector ila tripathi | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

Collector ila tripathi | అందరి భాగస్వామ్యంతోనే సత్వర ప్రగతి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు అయినప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

అక్షరటుడే, బోధన్ : Collector ila tripathi | అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అయినప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (collector ila tripathi) సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Collector ila tripathi | ఆచన్​పల్లిలో..

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం బోధన్(Bodhan) పట్టణం ఆచన్​పల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ సభలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ ఛైర్​పర్సన్ పద్మ శరత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను తెలియజేశారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తమకు చేకూరిన ప్రయోజనాల గురించి సభలో తమ అనుభవాలను తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Collector ila tripathi | ప్రజలకు పథకాలు అందజేయాలి

ప్రజలకు పథకాలు అందజేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని కలెక్టర్​ అన్నారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించడానికి, సమస్యల పరిష్కారానికి ఈ సభలు దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కు గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, చేయూత పథకం కింద పెన్షన్లు వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

మున్సిపల్ ఛైర్​పర్సన్ పద్మ శరత్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఎనలేని సహకారం అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా కమిషన్ రూపంలో సమకూరిన రూ.3.80 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. అదేవిధంగా ఐసీడీఎస్ ద్వారా వంద అంగన్​వాడీ కేంద్రాల నిర్వాహకులకు సెల్​ఫోన్లు అందజేశారు. ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యూవో పద్మ, ఏసీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: South Central Railway trains | ప్రయాణికులకు అలెర్ట్​.. 6 రైళ్లను క్రమబద్ధీకరించిన దక్షిణ మధ్య రైల్వే

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

drunk driving tests | మందుబాబులకు షాక్​.. మధ్యాహ్నం డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : drunk driving tests | మందుబాబులకు హైదరాబాద్​...

Employee JAC Protest | ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షను విజయవంతం చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Employee JAC Protest | ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో...

Bathukamma Kunta | బ‌తుక‌మ్మ‌ కుంట ముమ్మాటికీ చెరువే : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bathukamma Kunta | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని...

Bharosa Center | బాలలు, మహిళల రక్షణకు అండగా భరోసా సెంటర్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bharosa Center | బాలలు, మహిళల రక్షణకు...