అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Free Foundation Course | తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తున్న ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కేంద్రంలోని (Nizamabad City) నాందేవ్వాడలో ఉన్న షెడ్యూల్డ్ కులాల వసతి గృహంలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫౌండేషన్ కోర్సును కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) శుక్రవారం ప్రారంభించారు.
Free Foundation Course | 199 మంది ఉద్యోగాలు సాధించారు..
ఇప్పటి వరకు పది బ్యాచ్లలో 800 మందికి శిక్షణ అందించగా.. వారిలో 199 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని ఎస్సీ స్టడీ సర్కిల్ (SC Study Circle) నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం 11వ బ్యాచ్ లో 93 మంది ఫౌండేషన్ కోర్సులో చేరారని, వీరికి ఐదు నెలల పాటు ఉచిత భోజన వసతి సదుపాయాలతో నాణ్యమైన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు.
Free Foundation Course | ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
పోటీ పరీక్షల్లో ప్రతిభను కనబర్చి ఉద్యోగ అవకాశాలు పొందేలా స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఉచితంగా శిక్షణ అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సరైన విధంగా వినియోగించుకుంటే, ఆశించిన విధంగా ప్రభుత్వ కొలువు దక్కించుకోవచ్చని.. భవిష్యత్తు ఎంతో బాగుంటుందని హితవు పలికారు. సమయాన్ని వృథా చేయకుండా, గట్టి సంకల్పంతో కృషి చేయాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుచేసుకుంటూ ఏకాగ్రతతో కష్టపడి చదవాలని కర్తవ్యాన్ని బోధించారు. ఆంగ్లంలో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సూచించారు. వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కాకముందు నుంచే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని మార్గనిర్దేశం చేశారు. అంతకుముందు కలెక్టర్ వసతి గృహంలోని గదులు, కిచెన్ తదితర వాటిని సందర్శించి భోజన, వసతి సదుపాయాలు పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కోసం పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల బుక్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రజిత, సహాయ అధికారి రాజ గంగారాం, స్టడీ సర్కిల్ డైరెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad ORR | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

