Child Adoption Rules | పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుంటే కఠినచర్యలు: అడిషనల్​ కలెక్టర్​

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Child Adoption Rules | పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని అడిషనల్​ కలెక్టర్​ కిరణ్​కుమార్​ (Additional Collector Kiran Kumar) పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక.. ‘బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ’లో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణంలో దత్తత సహాయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Child Adoption Rules | మిషన్​ వాత్సల్య పోర్టల్​ ద్వారా..

ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పోర్టల్ (Mission Vatsalya Portal) ద్వారా పిల్లల దత్తత కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాకాకుండా అక్రమంగా దత్తత తీసుకున్న వారిపైన కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియను కావాల్సిన పత్రాలను, ప్రభుత్వ మార్గదర్శకాలను అందజేయాలని సూచించారు. అనంతరం హైదరాబాద్​కు (Hyderabad) చెందిన దంపతులకు బాబును దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్, కార్యాలయం సిబ్బంది అనిత, అనిల్, ముజాహిద్, స్రవంతి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Bala Bharosa Program | బాలభరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఎంహెచ్​వో రాజశ్రీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *