అక్షరటుడే, ఇందూరు: Kaleshwaram Pushkar Bus | కాళేశ్వరం పుష్కరాల (kaleshwaram) సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ (tgsrtc) ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరానికి ప్రత్యేక బస్సును (tgsrtc special bus) ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఆర్ఎం జ్యోత్స్న వివరాలు వెల్లడించారు.
Kaleshwaram Pushkar Bus | పన్నెండు రోజుల పాటు..
కాళేశ్వరం పుష్కరాలకు గురువారం నుంచి వచ్చే 12 రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. నిజామాబాద్ (Nizamabad) నుంచి ఉదయం 5 గంటలకు ప్రత్యేక బస్సు కాళేశ్వరానికి బయలు దేరుతుందన్నారు. టికెట్ ఛార్జ్ కేవలం రూ.380లుగా నిర్ణయించామని.. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. భక్తులు టీజీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలన్నారు. సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండేందుకు భక్తులు టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Telangana Railway Projects| అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ.. రైల్వే పనులపై ప్రత్యేక సమీక్ష


