Walkers Association | రాజారాం స్టేడియం వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Balla Sandeep Kumar

అక్షరటుడే, ​నిజామాబాద్ సిటీ: Walkers Association | నగరంలోని రాజారాం స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ ఉమారాణి రమేశ్​ హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

​అధ్యక్షుడిగా వై.దిగంబర్, ​ప్రధాన కార్యదర్శిగా ఎన్. సాయిలు, ​కోశాధికారిగా బి.వెంకటేష్ గౌడ్, ​ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాస చారి, ​సంయుక్త కార్యదర్శిగా ఏ.శ్రీశైలం, ​కార్యవర్గ సభ్యులుగా మఠం రవి, డి.వెంగళరావు, ఎం.రాజు, జి.రాకేష్, ఎస్.కే.షబాన ప్రమాణం చేశారు.

Walkers Association | రాజారాం స్టేడియం అభివృద్ధికి కృషి

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రాజారాం స్టేడియం అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. స్టేడియంలో ఉన్న సమస్యలను ఉన్నతాధికారులతో చర్చించి, జిల్లా ఇన్​ఛార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు.

​జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ అంతిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ.. స్టేడియం వద్ద డైలీ పేపర్లు, మ్యాగజైన్లు, ఇతర పుస్తకాలను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండి, శిక్షణ కోసం స్టేడియానికి వచ్చే యువత ఇవి ఉపయోగపడతాయన్నారు.

కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ కేతావత్ సురేఖ అమర్ సింగ్, ఐటీఐ అధ్యక్ష కార్యదర్శులు మురళి, పృథ్వీరాజ్, కాంగ్రెస్ నాయకులు కిషన్ రెడ్డి, అలాగే అసోసియేషన్ ప్రధాన సలహాదారులు వినయ్ కుమార్, డి.శంకర్, జ్ఞానేశ్వర్, మాజీ అధ్యక్షుడు నజీర్, రమాకాంత్, వాకర్స్ పాల్గొన్నారు.

Rajaram Stadium Walkers Association

ఇది కూడా చదవండి..: Digital Self Enumeration | స్వీయ గణనను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్​

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *